హీరోయిన్ లపై మండిపడిన శివాజీరాజా


Sivaji Raja fires on Tollywood heroines

తెలుగు సినిమాల్లో నటిస్తూ అత్యధిక పారితోషికాలు తీసుకుంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు వాళ్ళు సహకరించడం లేదని హీరోయిన్ లపై ఆగ్రహం వ్యక్తం చేసాడు నటుడు మా అధ్యక్షుడు శివాజీరాజా . మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరంగా ఓల్డేజ్ హోమ్ ని , అలాగే మా కార్యాలయానికి సొంత బిల్డింగ్ కట్టించాలని భావిస్తోంది మా కార్యవర్గం అందుకే సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను పెద్ద ఎత్తున ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు అయితే ఈ వేడుకలలో హీరోయిన్ లు పాల్గొనడానికి ముందుకు రావడం లేదు దాంతో వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు శివాజీరాజా .

హీరోయిన్ లు సహకరించడం లేదు కానీ హీరోలు చిరంజీవి , బాలకృష్ణ , మహేష్ బాబు , నాగార్జున , వెంకటేష్ ,లు సహకరించడానికి ముందుకు వచ్చారని అమెరికాలో భారీ ఎత్తున సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించ నున్నామని తెలిపాడు శివాజీరాజా . దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా ఉన్నారు హీరోయిన్ లు అందుకే క్రేజ్ ఉన్నప్పుడే సంపాదించుకుంటున్నారు .