శివాజీరాజా పై ఆరోపణలు చేసిన శృతి


maa president sivajiraja in trouble

మా అధ్యక్షుడి గా ఉన్న శివాజీరాజా కూడా కాస్టింగ్ కౌచ్ కు పాల్పడుతున్నాడని సంచలన ఆరోపణలు చేస్తోంది శృతి అనే వర్ధమాన నటి . హీరో శ్రీకాంత్ ని నాకు పరిచయం చేస్తానని చెప్పి శివాజీరాజా నన్ను చాలాసార్లు తిప్పించుకున్నాడని కానీ శ్రీకాంత్ ని మాత్రం పరిచయం చేయించలేదని అలాంటి శివాజీరాజా ఇప్పుడేమో పెద్ద నీతులు చెబుతున్నాడని టీవీ 9 లైవ్ షోలో పాల్గొని సంచలన ఆరోపణలు చేసింది శృతి .

శ్రీరెడ్డి రేపిన దుమారం టాలీవుడ్ ని షేక్ చేస్తుండగా ఇపుడు మరికొంతమంది యువతులు మీడియా ముందుకు వచ్చి ఇతరులపై అరోపణలు చేస్తున్నారు . తాజాగా శివాజీరాజా పై ఆరోపణలు రావడం సంచలనం సృష్టిస్తోంది . శివాజీరాజా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడి గా వ్యవహరిస్తున్నాడు . నటుడిగా కూడా పలు చిత్రాల్లో నటించాడు కానీ ఇప్పుడు శ్రీరెడ్డి పుణ్యమా అని శివాజీరాజా ఇబ్బందుల్లో పడ్డాడు .