ఫిల్మ్ ఫేర్ అవార్డు ఈవెంట్ ని బహిష్కరిస్తున్నారా


MAA think about ban on film fare event

ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక ఈనెల 16న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసారు , అయితే ఆ వేడుకలను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బహిష్కరించనున్నట్లు తెలుస్తోంది . భారీ ఎత్తున ఈవెంట్ ని నిర్వహిస్తున్న ఈ వేడుకని ఎందుకు బహిష్కరించాలని అనుకుంటున్నారో తెలుసా ….. ….. మా నటీనటులను ఉపయోగించుకొని , వాళ్ళ స్టార్ డం తో భారీ లాభాలను తెచ్చుకుంటున్నారు అలాగే క్రేజ్ ని సొంతం చేసుకుంటున్నారు కానీ మా అసోసియేషన్ కు ఇప్పటి వరకు ఉపయోగపడిన దాఖలాలు లేవు అని ఆరోపిస్తున్నారు .

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇక నుండి సొంతంగానే ఇలాంటి వేడుకలను నిర్వహించాలని భావిస్తోందట ! ఇలా వేడుకలను నిర్వహించడం వల్ల అసోసియేషన్ కు ఆర్ధిక సహకారం అందుతుందని భావిస్తున్నారట శివాజీరాజా అండ్ కో . అయితే ఫిల్మ్ ఫేర్ అవార్డులకు క్రేజ్ ఉంది , అంతేకాదు ఈసారి చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ , ఎన్టీఆర్ , ప్రభాస్ , విజయ్ దేవరకొండ లు బెస్ట్ హీరోల కేటగిరీ లలో పోటీ పడుతున్నారు కాబట్టి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఈవెంట్ ని మా బాయ్ కాట్ చేయడం సాధ్యం కాకపోవచ్చు . కానీ ఆలోచన మాత్రం చేస్తున్నారట అంతేకాదు ఇప్పటికే చాలామంది కి ఫిల్మ్ ఫేర్ ఈవెంట్ కు హాజరు కావద్దని మెసేజ్ లు కూడా పంపించారట .