గోపీచంద్ కి డైరెక్టర్ సంపత్ నంది స్టార్ ట్యాగ్


Macho Star tag to Gopichand
Macho Star tag to Gopichand

ధనం మూలం ఇదం జగత్ ..! అంటూ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసిన సంపత్ నంది – గోపీచంద్ జోడీ మళ్ళీ ఇప్పుడు “సీటీమార్” అనే సినిమాతో మన ముందుకు వస్తోంది. ఇందులో గోపీ సర్ కబడ్డీ కోచ్ గా కనిపిస్తారని సమాచారం. ఇక ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ సినిమాతో డైరెక్టర్ సంపత్ నంది హీరో గోపీచంద్ కి స్టార్ ట్యాగ్ జత చేసారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్ లో Macho Star గోపీచంద్ అని ఉంది. ఇప్పటివరకూ ఎన్నో హిట్ సినిమాలు చేసినా గోపీ సర్ ఎప్పుడూ తన పేరుకు ముందు స్టార్ ట్యాగ్ వేసుకోలేదు. తొలివలపు సినిమాతో మొదలైతే నిన్నమొన్నటి చాణక్య వరకూ సినిమాలో ఆయన పేరు టైటిల్స్ లో లేదా హీరో ఇంట్రడక్షన్ షాట్ లో సింపుల్ గా గోపీచంద్. టి అని మాత్రమే వచ్చేది.

గోపీచంద్ గారు తనదైన హైలెవల్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ కి, ఇంటెన్సిటీ తో ఉండే హీరోఇజం కి పెట్టింది పేరు. ఆయన సినిమాల్లో యాక్షన్ సీన్స్ కూడా అలాగే ఉంటాయి. ముఖ్యంగా, ఒక్కడున్నాడు సినిమాలో ఒక్క ఆయుధం కూడా వాడకుండా, 50 మందితో క్లోజ్డ్ షెడ్ లో చేసే ఆ ఫైట్ లాంటి సీక్వెన్స్ ఆయనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసాయి. అసలే కబడ్డీ అనేది పోరాట క్రీడ. యాక్షన్ పరంగా సినిమా అంశాలు ఎన్నో ఇందులో పిక్చరైజ్ చెయ్యవచ్చు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి గోపీచంద్ గారికి మంచి కమ్ బ్యాక్ అవ్వాలని కోరుకుందాం.