అమెరికాలో హనీమూన్ లో హీరోయిన్


madalasa sharma in honeymoon mood

అమెరికాలో హనీమూన్ చేసుకుంటోంది హీరోయిన్ మదాలసా శర్మ .1980 నాటి బాలీవుడ్ కింగ్ మిథున్ చక్రవర్తి తనయుడు మహాక్షయ్ వివాహం అచ్చం సినిమా పెళ్లిని తలపించిన విషయం తెలిసిందే . సరిగ్గా తాళి కట్టే సమయానికి రంగప్రవేశం చేసిన పోలీసులు మహాక్షయ్ ని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించడంతో పీటల మీదే పెళ్లి ఆగిపోయింది . కట్ చేస్తే అరెస్ట్ కాబడిన మహాక్షయ్ బెయిల్ మీద వచ్చాడు తన ప్రేయసి అయిన హీరోయిన్ మదాలసా శర్మ ని పెళ్లి చేసుకున్నాడు .

పెళ్లి కావడంతో హాయిగా హనీమూన్ కి వెళ్లారు , ప్రస్తుతం అమెరికాలో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు కొత్త జంట . అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నామని , హనీమూన్ బాగా జరుగుతోందని చెప్పకనే చెబుతోంది ఆ హనీమూన్ తాలూకు ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసి . తెలుగులో ఈ భామ అల్లరి నరేష్ సరసన ” ఫిట్టింగ్ మాస్టర్ ” చిత్రంలో , ఆలస్యం అమృతం చిత్రంలో నిఖిల్ సరసన నటించింది అలాగే మరో రెండు సినిమాలు ” మేము వయసుకు వచ్చాం , రామ్ లీల చిత్రాల్లో కూడా నటించింది . తెలుగు తో పాటుగా హిందీ , తమిళ్ , కన్నడ , పంజాబీ , జర్మన్ బాషలలో కూడా నటించింది మదాలసా శర్మ . ఇక ఇప్పుడేమో హాయిగా హనీమూన్ ని ఎంజాయ్ చేస్తోంది .

English Title: madalasa sharma in honeymoon mood