దర్శకుడు సురేందర్ రెడ్డి  మెచ్చిన మథనం


madhanam movie teaser launched bysurender reddy
madhanam movie teaser launched by Surender reddy

 దర్శకుడు సురేందర్ రెడ్డి  మెచ్చిన మథనం

దర్శకుడు సురేందర్ రెడ్డి మథనం టీజర్ ని విడుదల చేసారు . మథనం సినిమా చూశానని , బాగుందని తప్పకుండా ప్రేక్షకులను అలరించే సినిమా అవుతుందని అంటున్నాడు సురేందర్ రెడ్డి . శ్రీనివాస్ సాయి , భావన రావు జంటగా నటించిన ” మథనం ” చిత్రానికి అజయ్ సాయి మణికందన్ దర్శకత్వం వహించాడు . దివ్యా ప్రసాద్ – అశోక్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ సురేందర్ రెడ్డి కి బాగా నచ్చిందట .

అంతేకాదు సినిమా కూడా కొంత భాగం చూశానని చాలా  బాగుందని తప్పకుండా హిట్ అవుతుందని అంటున్నాడు . అశోక్ నాకు ఎప్పటినుండో పరిచయం , అమెరికా వెళ్లి బాగానే సంపాదించాడు . నాతో కూడా సినిమా నిర్మిస్తాడని అనుకుంటున్నా అంటూ మథనం చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశాడు సురేందర్ రెడ్డి . నిజంగానే సురేందర్ రెడ్డి చెప్పినట్లు  మథనం టీజర్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది మరి .