రామ్ సినిమాపై పూర్తి క్లారిటీ ఇచ్చిన మాధవన్

రామ్ సినిమాపై పూర్తి క్లారిటీ ఇచ్చిన మాధవన్
రామ్ సినిమాపై పూర్తి క్లారిటీ ఇచ్చిన మాధవన్

ఉస్తాద్ రామ్ పోతినేని ఇప్పుడు తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. ప్రముఖ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో రామ్ సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఉప్పెన భామ కృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.

ఈ చిత్రంపై బోలెడన్ని రూమర్లు మొదలయ్యాయి. ప్రముఖ నటుడు మాధవన్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. లింగుసామి రన్ చిత్రంలో మాధవన్ హీరోగా నటించిన విషయం తెల్సిందే. మళ్ళీ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

దీనిపై మాధవన్ రియాక్ట్ అయ్యాడు. “నాకు లింగుసామితో మళ్ళీ పనిచేయాలన్న ఆసక్తి ఉన్నా ప్రచారంలో రూమర్లలో ఎలాంటి నిజం లేదు. నేను తెలుగు సినిమాలో విలన్ రోల్ పోషించట్లేదు” అని తెలిపాడు మాధవన్. రీసెంట్ గా సవ్యసాచి, నిశ్శబ్దం చిత్రాల్లో మాధవన్ విలన్ గా నటించిన విషయం తెల్సిందే.