శుభ వార్త అంటోంది..కానీ పెళ్లి కాదంట‌..!


శుభ వార్త అంటోంది..కానీ పెళ్లి కాదంట‌..!
శుభ వార్త అంటోంది..కానీ పెళ్లి కాదంట‌..!

టాలీవుడ్‌లో ఇప్పుడు పెళ్లిళ్ల టైమ్ న‌డుస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ అంతా పెళ్లికి రెడీ అయిపోతున్నారు. గ‌త కొంత కాలంగా పెళ్ల‌నే మాటంటేనే ఆమ‌డ దూరం పారిపోయే యంగ్ హీరోలంతా ఇప్ప‌డు వ‌రుస‌గా బ్యాచిల‌ర్ లైఫ్‌కి బాయ్ బాయ్ చెప్పేసి ఫ్యామిలీ లైఫ్‌కి రెడీ అయిపోతున్నారు. ఇదే వ‌రుస‌లో యంగ్ హీరోయిన్‌, బీజేపీ పార్టీ నాయ‌కురాలు మాధ‌వీల‌త కూడా త్వ‌ర‌లో పెళ్లి వార్త చెప్ప‌బోతోంద‌ట‌.

సోష‌ల్ మీడియాలో మాధ‌వీల‌త పెట్టిన పోస్ట్ ఇందుకు అద్దంప‌డుతోంది. `చాలా నెలల తరువాత చాలా సంతోషంగా ఉంది. కొత్త జీవితం ప్రారంభమైంది. అద్భుతాలు జరిగాయి.. నేను ఎప్పుడూ అద్భుతాలను నమ్ముతున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. త్వరలో ప్రకటించ‌నున్నాను` అని పోస్ట్ చేసింది. దీంతో ఆమె స‌న్నిహితులంతా మాధ‌వీతల‌త వివాహం చేసుకోబోతోంద‌ని, శుభాకాంక్ష‌లు చెప్ప‌డం మొద‌లుపెట్టారు.

ఇంత‌లోనే మాధ‌వీల‌త షాకిచ్చింది. త‌ను పెట్టిన పోస్ట్ పెళ్లి గురించి కాద‌ని, త‌న పోస్ట్‌ని అంతా అపార్థం చేసుకున్నార‌ని, ప్ర‌స్తుతం ఇంట్లో పెళ్లి కోసం సంబంధాలు చూస్తున్నార‌ని, అన్నీ కుదిరిలే వ‌చ్చే ఏడాది వివాహం చేసుకుంటాన‌ని స్ప‌ష్టం చేసింది. ఇదేంటి శుభ వార్త అంటోంది. కానీ పెళ్లి కాద‌ని మాధ‌వీ ల‌త ఇలా ట్విస్ట్ ఇస్తోందేంటి అంటున్నారు నెటిజ‌న్స్‌.