మాధ‌వీల‌త వ‌ర్సెస్ డ్యాన్స్ మాస్ట‌ర్‌!


మాధ‌వీల‌త వ‌ర్సెస్ డ్యాన్స్ మాస్ట‌ర్‌!
మాధ‌వీల‌త వ‌ర్సెస్ డ్యాన్స్ మాస్ట‌ర్‌!

`న‌చ్చావులే` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మాధ‌వీ‌లత‌. ఆ త‌రువాత తెలుగులో రాణించాల‌ని ప్ర‌య‌త్నించినా ఆమె ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌లేదు. దాంతో బీజేపీ పార్టీలో క్రియాశీల‌కంగా వ్యవ‌హ‌రిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా గత కొంత కాలంగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. యూట్యూబ్‌లోనూ సంచ‌ల‌నం సృష్టిస్తూ వివాదాస్ప అంశాల‌పై స్పందిస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది.

తాజాగా ఆమె రిలీజ్ చేసిన ఓ వీడియో కొత్త వివాదానికి కార‌ణంగా మారింది. యూట్యూబ్ ఛాన‌ళ్ల‌లో వివాదాస్ప‌ద వ్య‌ఖ్యలు చేస్తూ డ్యాన్స్ మాస్ట‌ర్ రాకేష్ మాస్ట‌ర్ సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌పై నిత్యం విరుచుకుప‌డుతూ వివాదాలు సృష్టిస్తున్నారు. తాజాగా మాధ‌వీల‌త రిలీజ్ చేసిన ఓ వీడియోపై రాకేష్ మాస్ట‌ర్ నిప్పులు చెర‌గ‌డం వివాదానికి కార‌ణంగా నిలిచింది.

దీంతో వెంట‌నే స్పందించిన మాధ‌వీల‌త డ్యాన్స్ మాస్ట‌ర్ రాకేష్ మాస్ట‌ర్‌పై కేసు ఫైల్ చేసి లీగ‌ల్ నోటీసులివ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌న‌పై అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన రాకేష్ మాస్ట‌ర్ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేసింది. దీనిపై రాకేష్ మాస్ట‌ర్ ఎలా స్పందిస్తారా అని అంతా ఆరాతీస్తున్నారు.