మాధ‌వీల‌త పోస్ట్ బెడిసికొట్టింది!


 

Madhavi latha social media post goes wrong way
Madhavi latha social media post goes wrong way

ర‌విబాబు రూపొందించిన `న‌చ్చావులే` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మాధ‌వీల‌త ఈ మ‌ధ్య బీజేపీలో చేరి సోష‌ల్ మీడియాలో వ‌రుస పోస్ట్‌ల‌తో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇటీవ‌ల బైంసాలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ని తెలంగాణ మీడియా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, తెలంగాణ ప్ర‌భుత్వం ఆ వార్త‌ల్ని ప్ర‌చురించ‌కుండా అడ్డుకుంటోంద‌ని ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది.  అయితే తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ బెడిసికొట్టింది.

గ‌త కొంత కాలంగా మాధ‌వీల‌త మైగ్రేన్‌తో బాధ‌ప‌డుతున్న ఆమె సోష‌ల్ మీడియా ఫేస్ బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. అది మిస్ ఫైర్ అయి వైర‌ల్‌గా మారింది. ఆ పోస్ట్ చూసిన నెటిజ‌న్స్ మాధ‌వీల‌త తీవ్ర అనారోగ్యంతో మాన‌సికంగా బాధ‌ప‌డుతోందంటూ పోస్ట్‌లు పెట్ట‌డం వైర‌ల్ గా మారింది.

జ‌రిగిన త‌ప్పిదాన్ని గ్ర‌హించిన మాధ‌వీల‌త వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది. తాను ఆరోగ్యంగానే వున్నానని, భ‌విష్య‌త్తులోనూ ఆరోగ్యంగానే వుంటాన‌ని, నా ఆరోగ్యం గురించి త‌ప్పుడు వార్త‌ల్ని ప్ర‌చురించ‌డం ద‌య‌చేసి మానండి అంటూ విజ్ఞ‌ప్తి చేస్తోంది.