కత్తి మహేష్ ని తిడుతున్న పవన్ భక్తురాలు


madhavilatha comments on kathi mahesh

వివాదాస్పద సిని విమర్శకుడు కత్తి మహేష్ ని ఇష్టమొచ్చినట్లు తిడుతోంది పవన్ కళ్యాణ్ భక్తురాలు హీరోయిన్ మాధవీలత . నచ్చావులే చిత్రంతో తెలుగు సినిమారంగంలో అడుగుపెట్టిన ఈ భామ మొదటి చిత్రంతోనే సంచలనం సృష్టించింది అయితే ఆ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా అవి ఆడలేదు దాంతో ఈ భామ రేసులో లేకుండా పోయింది కట్ చేస్తే గత ఏడాది నుండి సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ ఉందని అందుకు నేను ఉదాహరణ అని సంచలన ఆరోపణలు చేసింది మాధవీలత .

ఇక కత్తి మహేష్ విషయానికి వస్తే …… ఇటీవల హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు కత్తి మహేష్ , దాంతో అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి , కాగా అదే కోవలో మాధవీలత కూడా సంచలన ఆరోపణలు చేసింది . కత్తి మహేష్ టార్చర్ తట్టుకోలేకే వాడి నుండి భార్య విడిపోయిందని అంటోంది మాధవీలత .

అంతేకాదు రామాయణం గురించి , దాని ప్రాముఖ్యత పై విశ్లేషణ అందిస్తోంది మాధవీలత . కత్తి మహేష్ బయట నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి లేదు , కావాలంటే ఇంట్లో కూర్చొని భావ ప్రకటన స్వేచ్ఛ గురించి చెప్పుకో అంతేకాని బయట కాదు ఆయిన్ నీకు ఏం అర్హత ఉందని రామాయణం గురించి మాట్లాడుతున్నావ్ అంటూ ఆవేశం వెళ్లగక్కింది మాధవీలత .

English Title: madhavilatha comments on kathi mahesh