టాలీవుడ్ సెక్స్ రాకెట్ పై స్పందించిన మాధవీలత


actress madhavilatha responds on tollywood sex racketఅమెరికాలోని చికాగో సెక్స్ రాకెట్ లో హీరోయిన్ మాధవీలత పేరు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వస్తుండటంతో మాధవీలత ఆవేశం కట్టలు తెంచుకుంది . అంతే ! సోషల్ మీడియా సాక్షిగా బూతులు తిట్టేస్తోంది నెటిజన్లను . టాలీవుడ్ సెక్స్ రాకెట్ గురించి విన్నాను అయితే అందులో నేను కూడా ఉన్నట్లు కొంతమంది పనిగట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారని అలాంటి వాళ్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది .

ఆ సంఘటనలో నువ్ వచ్చావా ? నువ్ ఉన్నావా ? నువ్ చూసావా ? అంటూ తనపై ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళని చెడామడా తిట్టేసింది మాధవీలత . శవాల మీద చిల్లర ఏరుకునే నాయాల్లారా ……. తెగ బలిసిన కుక్కల్లా వాడుతున్న మీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు . మీకు సమాధానం చెప్పి నా నిజాయితీ ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు నిజంగా దమ్ముంటే మీ ఏరియా ఎం ఎల్ ఏ ని అడుక్కోండి మా ఏరియాకి ఏం పీకావురా అని అంతేకాని నాతో పెట్టుకోవద్దు అంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది మాధవీలత . చికాగో లోని సెక్స్ రాకెట్ లో కొంతమంది హీరోయిన్ లు ఉన్నారని పేర్లు బయటకు పొక్కుతున్నాయి అయితే అందులో మాధవీలత పేరు కూడా కొంతమంది అదేపనిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేయడంతో ఆవేశంతో ఊగిపోతోంది .