దొరసాని బాగా వచ్చిందంటున్న మధుర శ్రీధర్


అల్లు శిరీష్ హీరోగా నటించిన ఎబిసిడి చిత్రాన్ని నిర్మించిన మధుర శ్రీధర్ రెడ్డి మంచి వసూళ్లు వస్తున్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు . కొంతమందికి మా సినిమా నచ్చలేదేమో కానీ సాధారణ ప్రేక్షకులకు బాగా నచ్చింది అందుకే చిన్న చిన్న సన్నివేశాలకే పగలబడి నవ్వుతున్నారు ……. మా ఎబిసిడి చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేసాడు .

ఇక మహేంద్ర అనే యువ దర్శకుడి దర్శకత్వంలో దొరసాని చిత్రాన్ని నిర్మించామని ఆ సినిమా చాలా బాగా వచ్చిందని తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు . అలాగే దొరసాని చిత్రాన్ని జూలై 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపాడు . దొరసాని చిత్రంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా డాక్టర్ రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే .