శరత్ కుమార్ అరెస్ట్ తప్పదా ?


శరత్ కుమార్ అరెస్ట్ తప్పదా ?
శరత్ కుమార్ అరెస్ట్ తప్పదా ?

వరలక్ష్మి శరత్ కుమార్ నాన్న శరత్ కుమార్ అరెస్ట్ తప్పకపోవచ్చని తెలుస్తోంది . నడిగర్ సంఘం కు చెందిన స్థలాన్ని అమ్మిన వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఓ వ్యక్తి కేసు వేయడంతో తక్షణమే శరత్ కుమార్ , రాధారవి లను అరెస్ట్ చేయాలనీ ఆదేషించింది తమిళ నాడు హైకోర్టు . నడిగర్ సంఘం కు అధ్యక్షుడిగా శరత్ కుమార్ ఉండగా రాధారవి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు . ఆ సమయంలోనే నడిగర్ సంఘం కు చెందిన భూమిని సంఘంలో చర్చించకుండా అమ్మారు దాంతో శరత్ కుమార్ , రాధారవి లపై కోర్టుకెక్కారు .

పూర్వాపరాలను పరిశీలించిన హైకోర్టు శరత్ కుమార్ , రాధారవి లని అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడమే కాకుండా మూడు నెలల్లో ఆ స్థల విక్రయానికి సంబందించిన దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు . దాంతో శరత్ కుమార్ , రాధారవి ల అరెస్ట్ తప్పకపోవచ్చు అని అంటున్నారు .