విశాల్‌కి షాకిచ్చిన చెన్నై హైకోర్ట్‌!


విశాల్‌కి షాకిచ్చిన చెన్నై హైకోర్ట్‌!
విశాల్‌కి షాకిచ్చిన చెన్నై హైకోర్ట్‌!

కోలీవుడ్ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం ప్ర‌ముఖంగా వినిపిస్తున్నపేరు విశాల్‌. న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల నుంచి నిత్యం వార్త‌ల్లో వుంటున్నారు విశాల్. ఇటీవ‌ల జ‌రిగిన న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లపై వివాదం త‌లెత్తిన విష‌యం తెలిసిందే. బెంజిమ‌న్ వ‌ర్గానికి విశాల్ వ‌ర్గానికి మ‌ధ్య వివాదం తారా స్థాయికి చేరింది. విశాల్ ఓటు హ‌క్కుని ర‌ద్దు చేయాల‌ని, ఎల‌క్ష‌న్ టైమ్ ముగిసినా య‌ధేశ్చ‌గా పోలింగ్ నిర్వ‌హించార‌ని, నిబంధ‌న‌లు ఉల్లంఘించారు కాబ‌ట్టి న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్ని ర‌ద్దు చేయాలంటూ బెంజిమ‌న్ వ‌ర్గం చెన్నై హైకోర్టుని ఆశ్ర‌యించింది,

వాదా ప్ర‌దివాదాలు విన్న త‌రువాత విశాల్ నిర్వ‌హించిన ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపుని నిలిపివేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టుకు విశాల్ వివ‌ర‌ణ ఇచ్చారు. త‌మ వ‌ర్గాం ఎలాంటి ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డ‌లేద‌ని, నిబంధంన‌ల ప్ర‌కార‌మే ఎన్నిక‌లు నిర్వ‌హించామ‌ని కోర్టుకు స్పష్టం చేశారు. దీంతో కోర్టు ఓ ప్ర‌త్యేక అధికారిని నియ‌మించి వివ‌రాలు సేక‌రించాల‌ని కోరింది. అత‌ని నియామ‌కంపై కూడా విశాల్ వ‌ర్గం అభ్యంత‌రం తెలియ‌జేసింది.

దీంతో ఆగ్ర‌హించిన కోర్టు ధ‌ర్మాస‌నం గ‌డువు తీరిన త‌రువాత నిర్వ‌హించిన ఎన్నిక‌లు చెల్ల‌వ‌ని, మ‌ళ్లీ ఎల‌క్ష‌న్ నిర్వ‌హించుకోమ‌ని, మూడు నెల‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిందేన‌ని శుక్ర‌వారం తుది తీర్పుని వెల్ల‌డించ‌డం విశాల్ వ‌ర్గాన్ని షాక్‌కు గురిచేస్తోంది. విశాల్ వ‌ర్గం హైకోర్టు ఆదేశాల‌ని పాటిస్తారా లేక హైకోర్టుని ధిక్క‌రించి సుప్రీమ్ త‌లుపుత‌డ‌తారా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.