మేస్ట్రో ఫైనల్ షెడ్యూల్ షూట్ షురూ

మేస్ట్రో ఫైనల్ షెడ్యూల్ షూట్ షురూ
మేస్ట్రో ఫైనల్ షెడ్యూల్ షూట్ షురూ

సెకండ్ వేవ్ లాక్ డౌన్ సడలించాక షూటింగ్ మొదలుపెడుతోన్న మొదటి తెలుగు సినిమాగా మేస్ట్రో గురించి చెప్పుకోవచ్చు. ఈ చిత్రం బాలీవుడ్ సూపర్ హిట్ అంధధూన్ కు రీమేక్ గా తెరకెక్కుతోంది. నితిన్ ఈ చిత్రంలో అంధుడిగా కనిపిస్తాడు. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా కనిపించనుంది.

తమన్నా కీలక పాత్రను చేస్తోంది. ఆమె పాత్ర నెగటివ్ షేడ్స్ తో ఉంటుంది. ఈరోజు నుండి ఫైనల్ షెడ్యూల్ ను మొదలుపెట్టారు. నితిన్, తమన్నాల మధ్య కీలకమైన ఎపిసోడ్స్ ను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్ తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని సమాచారం. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మేస్ట్రో సినిమాను జూన్ లో విడుదల చేద్దామనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది సాధ్యపడలేదు. షూటింగ్ మొత్తం పూర్తైన తర్వాత రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తుంది చిత్ర బృందం.