జపాన్ లో విడుదల కానున్న మగధీర


magadheera dubbing start in japanese language2009 లో తెలుగులో విడుదలైన మగధీర ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే . అప్పటివరకు ఉన్న తెలుగు చలన చిత్ర రికార్డులను అన్నింటినీ బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది మగధీర చిత్రం . ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర రాంచరణ్ తేజ్ కు రెండో సినిమా కావడం విశేషం . తన రెండో సినిమాతోనే చరిత్ర సృష్టించాడు చరణ్ . గీతా ఆర్ట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం తాజాగా జపాన్ భాషలోకి అనువాదం చేయాలనీ ప్రయత్నాలు చేస్తున్నారు జక్కన్న .

ఎన్టీఆర్ – చరణ్ లతో ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే అయితే ఆ సినిమా అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది కాబట్టి ఈలోపు ఉన్న ఖాళీ సమయాన్ని మగధీర కోసం కేటాయిస్తున్నాడట జక్కన్న . జపాన్ లో మగధీర సినిమాని విడుదల చేసి తన మార్కెట్ ని మరింతగా పెంచుకోవాలని కన్నేశాడు . ఇప్పటికే బాహుబలి తో ప్రభంజనం సృష్టించిన జక్కన్న కు మగధీర కూడా మరింత మార్కెట్ పెంచే సినిమా అవుతుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాడు . జపనీస్ భాషలోకి అనువాదం చేసే పనులు ప్రారంభించాడట జక్కన్న . ఎన్టీఆర్ – చరణ్ ల సినిమా ప్రారంభం అయ్యేలోపు ఆ పనులు చేయనున్నాడు .

English Title: magadheera dubbing start in japanese language