మురళీమోహన్ తల్లి మృతి


సినీ నటుడు , రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీమోహన్ తల్లి మాగంటి వసుమతి దేవి ( 100) ఈరోజు చనిపోయింది . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వసుమతి దేవి వందేళ్లు బ్రతకడం విశేషం . మాగంటి వసుమతి దేవి మరణంతో మాగంటి మురళీమోహన్ ఇంట్లో విషాదం నెలకొంది . తల్లి మరణవార్త తో మురళీమోహన్ తల్లడిల్లిపోయారు .

మాగంటి వసుమతి దేవి అంత్యక్రియలు రేపు జరుగనున్నాయి . మురళీమోహన్ సినీ నటుడిగా , నిర్మాతగా , పార్లమెంట్ సభ్యుడిగా సంఘంలో విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు . ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు . అయితే ఇటీవలే జరిగిన ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు దాంతో మురళీమోహన్ కోడలు మాగంటి రూప రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసింది .