పవన్ కళ్యాణ్ సినిమాలు – మహిళాభిమానం


Maguva maguva song decoded
Maguva maguva song decoded

ప్రస్తుతం సోషల్ మీడియాను  పవర్ స్టార్ ఫీవర్ ఊపేస్తోంది. వ్యూస్, లైక్ లు, షేర్ లు, కామెంట్ లు, రీ ట్వీట్ లు, డిస్కషన్స్ ఇలా అందరూ…. ఎక్కడ చూసినా పవర్ స్టార్ లేటెస్ట్ మూవీ “వకీల్ సాబ్” సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.  ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు విడుదల చేసిన మగువా …ఓ మగువా… అనే పాట రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.  “ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా…!” ;  నీదగు పాలనలో, ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడే గా..!” అనే లిరిక్స్ రాసిన రామ జోగయ్య శాస్త్రి గారు మళ్ళీ తన కలం స్థాయి మనకు పరిచయం చేసారు. ఇక ప్రత్యేకించి నిజమైన లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి, తమన్ అద్భుతమైన సంగీతం అందించారు.

పవన్ కళ్యాణ్ మొదటి నుండీ తన సినిమాలలో స్త్రీ పాత్రలకు ఎంతో ఉన్నతమైన స్థానమిస్తూ వచ్చారు. తన ప్రతీ సినిమాలో మహిళల పట్ల గౌరవం, ఆడవాళ్ళను ఎవరైనా ఇబ్బందిపెడితే  వాలకు బుద్ధి చెప్పడం, ఆడవాళ్ళ గొప్పతనం సమాజానికి ఇంకా అర్ధమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.

“తొలిప్రేమ” సినిమాలో చెల్లెలు సెంటిమెంట్ దగ్గర నుండి, “తమ్ముడు” సినిమాలో తన ప్రాణ స్నేహితురాలు జాను అనే క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం, “బంగారం” సినిమాలో హీరోయిన్ ప్రేమించిన వాడితో ఆమెను కలిపే ప్రయత్నం మరియు హీరోయిన్ చెల్లెలిని విలన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసినప్పుడు కాపాడే క్రమంలో హీరో క్యారెక్టర్ చెప్పే ఫిలాసఫీ, “అన్నవరం” సినిమాలో అద్భుతమైన చెల్లెలు సెంటిమెంట్, “జానీ” సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన తీరు, “కొమరం పులి” సినిమాలో మదర్ సెంటిమెంట్,  “తీన్ మార్” సినిమాలో ఫ్లాష్ బ్యాక్ హీరో అర్జున్ పాల్వాయ్ క్యారెక్టర్, “బాలు” సినిమాలో జయసుధ పాత్ర తో సెంటిమెంట్,  “పంజా” సినిమాలో తన స్నేహితురాలు జాహ్నవి ని చంపిన విలన్ కొడుకు ని హీరో క్యారెక్టర్ చంపెయ్యడం, “గుడుంబా శంకర్” సినిమాలో లే..లే పాటలో ఆడ పిల్లలను ఏడిపించే వాళ్ళను శిక్షించడం, “గబ్బర్ సింగ్” సినిమాలో మళ్ళీ మదర్ సెంటిమెంట్, “గోపాలా.. గోపాలా..” సినిమాలో ద్రౌపది పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ధర్మాన్ని వివరించిన తీరు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు.

ఒక మనిషి పర్సనల్ క్యారెక్టర్ లో ఇంతగా డెప్త్  లేకపోతే ఇలా ప్రతీ సినిమాలో మహిళల పట్ల ఇంత గౌరవం, శ్రద్ధ, చూపించడం కుదరదు. ఇవన్నీ అర్ధం కాని కొంతమంది ప్రత్యర్ధులు ఆయన వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారికి ఆడవాళ్లంటే ఎంత గౌరవం ఉందో.? అందరూ చేసుకోవాలని ఆశిస్తున్నాం.