మహాసముద్రంలో దూకే హీరోలు దొరికేసారు

మహాసముద్రంలో దూకే హీరోలు దొరికేసారు
మహాసముద్రంలో దూకే హీరోలు దొరికేసారు

తొలి సినిమా ఆరెక్స్ 100తోనే సంచలనాన్ని సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి తన రెండవ చిత్రంగా మహా సముద్రం అనే స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాడు. దీనికోసం కొంతమంది స్టార్ హీరోలను కూడా కలిసాడు అజయ్. ఈ సందర్భంగానే రవితేజను కలవగా మొదట చేస్తానని తర్వాత పారితోషికంలో తేడా రావడంతో చేయనని అన్నాడంటూ వార్తలు వచ్చాయి.

అందుకే అజయ్ భూపతి రవితేజను ఉద్దేశిస్తూ చీప్ స్టార్ అని కామెంట్స్ కూడా వేసాడు. అయితే ప్రస్తుతం మహాసముద్రం సినిమాకి ఇద్దరు హీరోలు దొరికేసారు. ఈ మల్టీస్టారర్ స్క్రిప్ట్ కు ఇద్దరు యువ హీరోలు కార్తికేయ, విశ్వక్ సేన్ ఓకే చెప్పినట్లు సమాచారం. స్టార్ హీరోలతో పనవ్వట్లేదని యువ హీరోలతో ముందుకు వెళదామని అజయ్ డిసైడ్ అయ్యాడు.

ఇది కూడా ఒక రకంగా మంచిదే. స్టార్ హీరోలు అయితే మహాసముద్రం వంటి బోల్డ్ స్క్రిప్ట్ ను కొంచెం టోన్ డౌన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు యువ హీరోలను ఎంచుకోవడం ద్వారా పూర్తి స్వేచ్ఛతో అజయ్ ఈ సినిమాను తెరకెక్కించుకోవచ్చు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కొలిక్కి వస్తుండడంతో త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని ఆశించవచ్చు.