మహా సముద్రం నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చిందిగా

మహా సముద్రం నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చిందిగా
మహా సముద్రం నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చిందిగా

గత కొంత కాలంగా సినిమాల ఎంపికలో తప్పులు చేస్తున్నాడు శర్వానంద్. నటుడిగా ఇప్పటికే తనను ప్రూవ్ చేసుకున్న శర్వా ఎందుకో నటుడిగా బలమైన పాత్రలను ఎంచుకోవట్లేదు. అయితే మహా సముద్రం ఈ విమర్శలకు సరైన సమాధానం చెబుతుందని నమ్మకంగా ఉన్నాడు. ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహా సముద్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. వైజాగ్ నేపథ్యంలో సాగే క్రైమ్ డ్రామాగా చెబుతున్నారు.

ఈ చిత్రంలో సిద్ధార్థ్ మరో లీడ్ రోల్ ను పోషిస్తున్నాడు. మహా సముద్రం చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాలో శర్వా, సిద్ధార్థ్ ఇద్దరూ చెడ్డ వ్యక్తులుగానే కనిపిస్తారట. వీరి మధ్య పోరాటమే మహా సముద్రం అని చెబుతున్నారు. ఇద్దరి మధ్యా ఈగో క్లాష్ లు ఆ రకంగా సినిమా ఉంటుందిట. మెజారిటీ భాగం ఇద్దరి పాత్రలూ నువ్వా నేనా అనే ఉంటాయని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కూడా చనిపోతుందన్న లీక్ వచ్చింది. మరి వీటిలో ఎన్ని నిజాలు ఉంటాయో అన్నది చూడాలి.