`మ‌హా స‌ముద్రం` రిలీజ్ డేట్ ప్ర‌క‌టించేశారు!

`మ‌హా స‌ముద్రం` రిలీజ్ డేట్ ప్ర‌క‌టించేశారు!
`మ‌హా స‌ముద్రం` రిలీజ్ డేట్ ప్ర‌క‌టించేశారు!

శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్ హీరోలుగా న‌టిస్తున్న తాజా చిత్రం `మ‌హా స‌ముద్రం`. `Rx 100` చిత్రంతో సంచ‌ల‌నం సృష్టించిన అజ‌య్ భూప‌తి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అదితీరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది.

విభిన్న‌మైన ప్రేమ‌క‌థ‌కు యాక్ష‌న్ నేప‌థ్యాన్ని జోడించి ద‌ర్శ‌కుడు అజ‌య్ భూపతి తెర‌కెక్కిస్తున్నారు. స‌రికొత్త నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 19న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం శనివారం ప్ర‌క‌టించింది. న‌డి స‌ముద్రంలో ఆగిన ఓ ప‌డ‌వ ఎడ్జ్‌పై ఎడ‌ముఖం పెడ‌ముఖంగా కూర్చున్న ఇద్ద‌రు హీరోలు.. శ‌ర్వా చిగ‌రేట్ కాలుస్తున్న పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

అరుణ సంధ్య వేళ ఎర్ర‌బారిన ఆకాశం.. నిప్పులు క‌క్కుతూ అరుణ వ‌ర్ణ‌మై క‌నిపిస్తోంది. ఓ థీమ్‌తో రిలీజ్ చేసిన ఈ మూవీ పోస్ట‌ర్స్ ఇప్ప‌టికే టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారాయి. ప్రేమ‌, యుద్ధం.. అనే కాన్సెప్ట్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సినిమాలో శ‌ర్వా, సిద్ధార్ధ్‌ల పాత్ర‌లు స‌రికొత్త పంథాలో సాగుతాయ‌ని తెలుస్తోంది.