ఈ భామ మహేష్ ని ముంచుతుందా ?


Mahaesh babu fans scared with pooja hegde 

పూజా హెగ్డే ……. అందాల భామ అందులో అనుమానం లేదు కాకపోతే ఈ భామ నటించిన చిత్రాలేవీ ఇంతవరకు హిట్ కాలేదు . హీరోయిన్ గా నటించిన చిత్రాలన్నీ ప్లాప్ ……. కాకపోతే ఐటెం సాంగ్ చేసిన రంగస్థలం మాత్రమే బ్లాక్ బస్టర్ . అయితే రంగస్థలం చిత్రంలో ఈ భామ హీరోయిన్ కాదు కాబట్టి ఒక పాట కోసం మూడు నిముషాలు అలా నర్తించి ఇలా వెళ్ళిపోయింది కాబట్టి ఈమె ఖాతాలో ఆ సినిమా వేయలేం . ఇక హీరోయిన్ గా నటించిన చిత్రాల్లో అరవింద సమేత వీర రాఘవ చిత్రం కూడా ఉంది . ఇది దసరా సెలవుల మధ్య విడుదల అయ్యింది కాబట్టి ఆ మాత్రం వసూళ్లు వచ్చాయి లేదంటే ఇంకా ఘోర పరాజయం పొందేది . ఒక్క నైజాం లో మాత్రమే హిట్ అయ్యింది అరవింద సమేత , మిగతా అన్నిచోట్లా బయ్యర్లు నష్టపోయారు .

టాలీవుడ్ లో ఈ భామ హీరోయిన్ గా ఒక లైలా కోసం , ముకుంద , దువ్వాడ జగన్నాథం , సాక్ష్యం , అరవింద సమేత చిత్రాలు చేయగా రంగస్థలం లో ఐటెం సాంగ్ చేసింది . ఇక ఇప్పుడేమో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మహర్షి చిత్రంలో నటిస్తోంది . హిందీలో నటించిన సినిమా మొహంజదారో కూడా ప్లాప్ అయ్యింది దాంతో మహేష్ ఫ్యాన్స్ భయపడుతున్నారు . ఈ భామ మహేష్ కు హిట్ ఇస్తుందా ? లేక ముంచుతుందా ? అని . ఏం చేస్తుందో తెలియాలంటే 2019 ఏప్రిల్ లో మహర్షి సినిమా విడుదల అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే .

English Title: Mahaesh babu fans scared with pooja hegde