మహానటి 9 రోజుల కలెక్షన్లు


mahanati 9 days world wide collectionsమహానటి 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 23 కోట్ల షేర్ ని రాబట్టి నిర్మాతలకు దండిగా డబ్బులు కట్టబెడుతోంది . సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఈ మహానటి పట్ల ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు . రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ లోను అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి మహానటి చిత్రానికి అంతేకాదు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ కు కూడా ఎనలేని కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి . వైజయంతి మూవీస్ బ్యానర్ పై సంచలన చిత్రాలను నిర్మించాడు అశ్వనీదత్ అయితే గత పదేళ్లుగా సరైన హిట్ లేదు ఆ బ్యానర్ లో .

సరిగ్గా అలాంటి సమయంలో మహానటి చిత్రంతో ఆ లోటు ని భర్తీ చేసాడు నాగ్ అశ్విన్ . దాంతో అశ్వనీదత్ చాలా సంతోషంగా ఉన్నాడు . ప్రేక్షకుల రివార్డులతో పాటు వసూళ్లు కూడా బాగా వస్తుండటంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉన్నారు . ఇక ఏరియాల వారీగా వసూళ్లు చూద్దామా !

నైజాం – 5. 85 కోట్లు
సీడెడ్ – 1. 23 కోట్లు
ఈస్ట్ – 0. 92 కోట్లు
వెస్ట్ – 0. 64 కోట్లు
ఉత్తరాంధ్ర – 1. 66 కోట్లు
కృష్ణా – 1. 25 కోట్లు
గుంటూరు – 0. 98 కోట్లు
నెల్లూరు – 0. 31 కోట్లు
కర్ణాటక – 1 కోటి
అమెరికా – 7. 98 కోట్లు
తమిళనాడు – 0. 63 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 0. 85 కోట్లు

మొత్తం – 23. 3 కోట్ల షేర్ 9 రోజుల్లో