మహానటి డైరెక్టర్ తదుపరి సినిమా ఎప్పుడు ?


Nag Ashwin
Nag Ashwin

మహానటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల రివార్డ్ లను సైతం అందుకున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్ . అయితే మహానటి విడుదలై 14 నెలలు గడిచిపోయింది కానీ ఇంతవరకు నాగ్ అశ్విన్ కొత్త సినిమా ఏంటి అన్నది మాత్రం తెలియడం లేదు . మహానటి చిత్రాన్ని చూసిన చిరంజీవి నాగ్ అశ్విన్ ని మెచ్చుకుంటూ ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి లాంటి సినిమా చేయాలనీ ఉందని మంచి కథ దొరికితే తప్పకుండా చేద్దామని హామీ ఇచ్చాడు .

హామీ ఇవ్వడమే కాకుండా మీడియా ముందు కూడా చెప్పాడు . నాగ్ అశ్విన్ మంచి సోషియో ఫాంటసి కథ తో వస్తే తప్పకుండా చేస్తానని అన్నాడు . అయితే మహానటి తర్వాత నాగ్ అశ్విన్ మరో సినిమా ప్రకటించలేదు . ఇక చిరు కూడా తన తదుపరి సినిమాలను లైన్లో పెడుతున్నాడు దాంతో నాగ్ అశ్విన్ తదుపరి సినిమా చేసేది ఎప్పుడు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది .