మహానటి దర్శకుడి భారీ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం 


Nag Ashwin
Nag Ashwin

మహానటి వంటి అద్భుత చిత్రాన్ని అందించిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చే నెలలో భారీ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది వైజయంతి మూవీస్ సంస్థ . మహానటి వంటి బయోపిక్ తో సంచలనం సృష్టించి మళ్ళీ తన పూర్వ వైభవాన్ని చాటుకుంది ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ . మహానటి ఇచ్చిన ఉత్సాహంతో పీరియాడిక్ మూవీ భారీ స్థాయిలో నిర్మించనున్నట్లు తెలుస్తోంది .

మహానటి తర్వాత నాగ్ అశ్విన్ నుండి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో చాలామంది అయోమయానికి గురయ్యారు అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రకటనతో అసలు విషయం బయటపడింది . తాజాగా ఈ సినిమా కోసం పనిచేయడానికి విజువల్స్ ఆర్టిస్ట్ లు , డిజనర్స్ అలాగే రైటర్స్ కావాలని ట్వీట్ చేసింది వైజయంతి మూవీస్ సంస్థ . సెప్టెంబర్ లో కొత్త సినిమా స్టార్ట్ అవుతుందన్న మాట !