ఓవర్ సీస్ లో 15 కోట్లు కొల్లగొట్టిన మహానటి


mahanati movie crossed 2.5 million dollars in overseasమహానటి చిత్రానికి ఎదురే లేకుండా పోయింది , సినిమా విడుదల అయిన నాటి నుండి పాజిటివ్ రిపోర్ట్స్ రావడమే కాకుండా మంచి కలెక్షన్లు కూడా రాబడుతోంది . సినిమా చూడటానికి అంతగా ఇష్టపడని వాళ్ళు సైతం సకుటుంబ సపరివార సమేతంగా మహానటి చిత్రాన్ని చూస్తున్నారు . సావిత్రి చనిపోయి దాదాపు నాలుగు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఆమె ప్రేక్షకుల పై చెరగని ముద్ర వేశారని మరోసారి రుజువు చేస్తోంది మహానటి చిత్రం .

ప్రీమియర్ షోలతోనే సంచలనం సృష్టించిన మహానటి అమెరికాలో ఏకంగా రెండున్నర మిలియన్ డాలర్ల ని కొట్టేసింది . ఒక స్టార్ హీరో లేని చిత్రం ఓవర్ సీస్ లో 15 కోట్లు వసూల్ చేయడం గొప్ప విషయం . రెండున్నర మిలియన్ డాలర్ల ని దాటినప్పటికీ ఇప్పటికి కూడా మంచి వసూళ్ల ని రాబడుతోంది మహానటి చిత్రం . ఈ చిత్రం ఇంతగా వసూల్ చేయడానికి ఒకటి హృదయాలను కదిలించే చిత్రం కాగా రెండో కారణం మరో సినిమా ఏది కూడా పోటీ లేకపోవడమే ! వచ్చిన చిత్రాలు ఇలా వచ్చి అలా పోతున్నాయి దాంతో నాగ అశ్విన్ మహానటి బ్రహ్మాండమైన వసూళ్ల ని సాధిస్తోంది .