మెల్ బోర్న్ ఫిలిం ఫెస్టివల్ లో మహానటి


mahanati nominated prestigious film festivalమహానటి మెల్ బోర్న్ లో జరిగే ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికయ్యింది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కేటగిరీ లలో మహానటి పోటీ పడుతోంది . ఉత్తమ నటి , ఉత్తమ సహాయ నటి తో పాటుగా ఉత్తమ చిత్రం కేటగిరి లలో మహానటి నామినేట్ అయ్యింది . మహానటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా వైజయంతి మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది . వేసవిలో విడుదలైన మహానటి చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు . చాలాకాలం తర్వాత వైజయంతి మూవీస్ కి తిరుగులేని విజయాన్ని అందించింది మహానటి చిత్రం .

పలు అవార్డులు , ప్రేక్షకుల రివార్డులను సొంతం చేసుకున్న మహానటి తాజాగా మెల్ బోర్న్ లో జరిగే ఫిలిం ఫెస్టివల్ లో మూడు కేటగిరీ లలో పోటీ పడుతుండటం తో ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు . మా సినిమా మూడు విభాగాలలో పోటీ పడుతోంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు నాగ్ అశ్విన్ . మహానటి గా కీర్తి సురేష్ నటించగా సహాయ నటి పాత్రలో సమంత నటించింది ఈ ఇద్దరు కూడా అవార్డుల కోసం పోటీ పడుతున్నారు . విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ , రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించిన మహానటి చిత్రానికి ప్రేక్షకుల ప్రశంసలతో పాటుగా బోలెడు విమర్శలు కూడా ఎదుర్కొంది సావిత్రి – జెమిని గణేశన్ ల పాత్రల తీరుతెన్నుల పట్ల .

English Title: mahanati nominated prestigious film festival