మహానటి సావిత్రికి హైదరాబాద్ లో ఇల్లు


mahanati savitri house in hyderabad

మహానటి సావిత్రి అప్పట్లో బాగా డబ్బు సంపాదించడంతో చెన్నై తో పాటుగా పలు చోట్ల ఆస్థులను కొనడమే కాకుండా విలువైన భూములను సైతం కొంది , అందులో భాగంగానే హైదరాబాద్ లో కూడా సావిత్రి రెండు బంగళాలు కొన్నది . ఎందుకంటే హైదరాబాద్ లో షూటింగ్ లు జరుగుతుండేవి దాంతో హైదరాబాద్ వచ్చినప్పుడు తన సొంత ఇంట్లో ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇక్కడ విశాలమైన బంగ్లా కొన్నది . ఇక స్థలం కూడా చాలా పెద్దది ….. ఏకంగా ఎకరం స్థలం ఉంటుంది .

అయితే ఇంతకీ హైదరాబాద్ లో సావిత్రి ఇల్లు ఎక్కడో తెలుసా ……. ఇప్పుడు మధురానగర్ గా పిలవబడుతున్న ఏరియాలో కృష్ణకాంత్ పార్క్ ఎదురుగా ఎకరం స్థలం కొన్నది . కృష్ణకాంత్ పార్క్ ఒకప్పుడు పెద్ద చెరువు కాలక్రమంలో డ్రైనేజ్ గా మారింది కట్ చేస్తే చంద్రబాబు హయాంలో ఆ చెరువు ని కృష్ణకాంత్ పార్క్ గా మారింది . అయితే మహానటి సావిత్రి అక్కడ ఎందుకు స్థలం కొందో తెలుసా ….. ఖాళీగా ఉన్న సమయంలో ఆ చెరువు ముందు కూర్చొని సేద తీరవచ్చని . అయితే ఆ ఇల్లు తన అక్క బావ పేరిట తీసుకోవడంతో వాళ్ళు ఆ పెద్ద ఇంటిని స్థలాన్ని అమ్మేశారు కట్ చేస్తే ఇప్పుడు అంతా అపార్ట్ మెంట్లు వెలిసాయి అక్కడ .