విజయనిర్మల మరణించడంతో మహర్షి వేడుకలు రద్దు

maharshi
maharshi

సీనియర్ నటి , దర్శకురాలు విజయనిర్మల మరణించడంతో రేపు జరగాల్సిన  మహేష్ బాబు నటించిన మహర్షి 50 రోజుల వేడుకలకు రద్దు చేసారు . ఆమేరకు కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేసారు . విజయనిర్మల తెలుగు సినిమాకు చేసిన సేవలకు గాను నిర్ణయం తీసుకున్నారు . అలాగే కృష్ణ భార్య కూడా కావడంతో మహర్షి వేడుకలు రద్దు చేసారు

మే 9 మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం విడుదలైన విషయం తెలిసిందే . భారీ ఓపెనింగ్స్ సాధించిన మహర్షి 200 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మహర్షి నిలవడంతో 50 రోజుల వేడుకలను హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో చేయడానికి సన్నాహాలు చేసారు . కానీ ఈలోపు విజయనిర్మల చనిపోవడంతో మహర్షి వేడుకలు రద్దయ్యాయి