రాయలసీమలో అదరగొట్టిన మహేష్ బాబు


రాయలసీమ హక్కుల విషయంలో మహేష్ బాబు అదరగొట్టాడు . తాజాగా మహేష్ బాబు నటిస్తున్న చిత్రం మహర్షి కాగా ఈ చిత్ర రాయలసీమ హక్కుల కోసం పలువురు పోటీ పడగా చివరకు 12. 6 కోట్లకు అమ్ముడుపోయాయి దాంతో మహర్షి చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . పన్నెండున్నర కోట్లకు పైగా మహర్షి హక్కుల కోసం చెల్లిస్తుండటంతో అక్కడ మహర్షి 25 కోట్లకు పైగా రాబట్టాల్సిన అవసరం ఏర్పడింది .

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మహర్షి . మే 9 న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇప్పటికే డిజిటల్ , శాటిలైట్ , ఓవర్ సీస్ హక్కుల రూపంలో భారీ మొత్తం రాగా సీడెడ్ హక్కులు 12. 6 కోట్లకు అమ్ముడుపోవడంతో నిర్మాతలు రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్ పొందనున్నారు . మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు .