మహర్షి సెన్సార్ పూర్తి


మహర్షి సెన్సార్ పూర్తి
మహర్షి పోస్టర్

మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది . ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఎటువంటి కట్స్ ఇవ్వకపోవడం విశేషం అయితే హింస తో పాటుగా పూజా హెగ్డే గ్లామర్ తో చంపేసింది కాబట్టి ఈ చిత్రానికి క్లీన్ యు ఇవ్వకుండా ” యు బై ఏ ” సర్టిఫికెట్ ఇచ్చారు . పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అని అంటున్నారు . హిట్ కోసం తపించిపోతున్న ఈ భామ రెచ్చిపోయి అందాలను ఆరబోసింది అందుకే యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చారట .

మహేష్ బాబు కున్న స్టార్ డం తో భారీ ఓపెనింగ్స్ లభించడం ఖాయం , అయితే ఆ తర్వాత సినిమా బాగుందని టాక్ వస్తే రికార్డుల మోత మోగించడం ఖాయం . మహర్షి చిత్రానికి బాక్సాఫీస్ వద్ద సరైన పోటీ లేదు దాంతో భారీ ఓపెనింగ్స్ అయితే రావడం ఖాయమైపోయింది . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం భారీ ఎత్తున మే 9 న విడుదల కానుంది .