మహర్షి కి షాక్ ఇచ్చిన ఓవర్సీస్


ఓవర్సీస్ మార్కెట్ లో మహేష్ బాబు మొనగాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ ఓవర్సీస్ లో సూపర్ స్టార్ ఒక్కడే అదే సూపర్ స్టార్ మహేష్ బాబు . కానీ మహర్షి విషయంలో ఖంగుతిన్నాడు మహేష్ బాబు . కేవలం ప్రీమియర్ షోలతోనే వన్ మిలియన్ డాలర్ల ని కొల్లగొడతాడు అని అనుకుంటే మహర్షి ఆ ఫీట్ ని సాధించలేకపోయింది .

ఇంతకుముందు స్పైడర్ అనే డిజాస్టర్ సినిమా సైతం ప్రీమియర్ షోలతోనే వన్ మిలియన్ మార్క్ ని అందుకుంది కానీ మహర్షి చిత్రం మాత్రం ఆ మార్క్ కు కాస్త దూరంలో ఆగిపోయింది దాంతో ఓవర్ సీస్ ప్రేక్షకులు మహేష్ కు షాక్ ఇచ్చినట్లే భావించాలి . మహర్షి చిత్రం ప్రీమియర్ షోలతో $510 K డాలర్లకి రాబట్టింది . దాంతో 1 మిలియన్ మార్క్ ని చేరుకోలేకపోయింది . ఇక ఇపుడేమో సినిమాకు పూర్తిగా పాజిటివ్ టాక్ లేదు దాంతో ఓవర్ సీస్ బయ్యర్ పరిస్థితి ఏంటి ? అన్నది ప్రశ్నగా మారింది .