మహర్షి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందంటున్న మహేష్


మహర్షి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందంటున్న మహేష్
మహేష్ బాబు

మహర్షి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమా వ్యక్తం చేసాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు . మహర్షి చిత్ర కథ కు అద్భుతమైన స్పాన్ ఉంది అందుకే 140 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాల్సి వచ్చింది ఈ విషయంలో నా ముగ్గురు నిర్మాతలకు కృతఙ్ఞతలు తెలపాల్సి ఉందని అన్నారు మహేష్ . ఈ సినిమాని నా 25 వ సినిమాగా కావాలని డిసైడ్ చేసింది కాదని , ఇంత జెన్యూన్ ఫిలిం ఇంతవరకు రాలేదు ….. అంతేకాదు చాలా పవర్ ఫుల్ పాయింట్ కూడా అంటూ మహర్షి చిత్ర లావిష్ గురించి చెప్పాడు మహేష్ .

మహర్షి చిత్రంలో కాలేజ్ స్టూడెంట్ గా సాఫ్ట్ వేర్ కంపెనీ కి సి ఈ ఓ గా అలాగే రైతుల కోసం అన్నీ వదిలేసి గ్రామంలోకి వచ్చే యువ రైతుగా మూడు విభిన్న కోణాల్లో కనిపించనున్నాడు మహేష్ . ఇక ఈ సినిమాకు 140 కోట్ల బడ్జెట్ అయ్యింది . దాంతో మహర్షి భారీ విజయం సాధిస్తే తప్ప బయ్యర్లు ఒడ్డున పడరు . అసలు ఈ కథ మొత్తం వినకుండా వంశీ పైడిపల్లి ని పంపేద్దామని అనుకున్నాడట ! కానీ ఎప్పుడైతే 20 నిమిషాల నెరేషన్ విన్నాడో అప్పుడు తప్పకుండా చేయాల్సిన సినిమా అని ఫిక్స్ అయ్యాడట మహేష్ . అయితే మహేష్ నమ్మకం నిజం అవుతుందా ? లేదా ? అన్నది ఈనెల 9 న తేలనుంది .