50 కోట్లు క్రాస్ చేసిన మహర్షిమూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టిస్తోంది మహర్షి . మహేష్ బాబు నటించిన మహర్షి మే 9 న భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మహర్షి చిత్రానికి భారీ ఓపెనింగ్స్ లభించాయి . అయితే ఈ సినిమాకు ప్రశంసలతో పాటుగా డివైడ్ టాక్ కూడా వచ్చింది దాంతో 100 కోట్లకు పైగా షేర్ రావడం కష్టమేమో అనుకున్నారు .

అయితే మూడు రోజుల్లోనే 50 కోట్లకు పైగా షేర్ రావడంతో ఇదే జోరు కనుక కొనసాగితే మాగ్జిమమ్ రికవరీ కావచ్చని ఒకవేళ ఈ జోరు కంటిన్యూ కాకపోతే మాత్రమే ఇబ్బంది ఎదురు అవుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . మహేష్ స్టామినా తో ఈ భారీ వసూళ్లు వచ్చాయి . మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటించగా అల్లరి నరేష్ ఓ విభిన్న పాత్ర పోషించి మెప్పించాడు . ఇక ఈరోజు హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో మహర్షి సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు ఆ చిత్ర బృందం .