మహర్షి ఓవర్సీస్ టాక్ ఎలా ఉందంటే


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ఓవర్సీస్ రిపోర్ట్ రానే వచ్చింది. ఇంతకీ మహేష్ మహర్షి  టాక్ ఎలా ఉందో తెలుసా…… సూపర్ హిట్ అనే అంటున్నారు అమెరికాలో చూసిన వాళ్ళు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున మహర్షి చిత్రం విడుదల అయ్యింది. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఇంకా ముందుగానే షోలు పడతాయన్న విషయం తెలిసిందే. ఓవర్సీస్ టాక్ ప్రకారం మహర్షి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

మహేష్ బాబు మూడు విభిన్న కోణాల్లో కనిపించడంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు ప్రేక్షకుడు కూడా ఫిదా అవుతున్నారు. కాలేజ్ స్టూడెంట్ గా , కార్పొరేట్ సి ఈ ఓ గా రైతుగా ఇలా మూడు వెరీయేషన్ లలో మహేష్ కనిపించడంతో అభిమానుల ఆనందానికి అంతే లేకుండాపోయింది. దీనికి తోడు రైతుల సమస్యలపై చక్కని సందేశాత్మక చిత్రంగా వంశీ పైడిపల్లి తెరకెక్కించడంతో మరింతగా ఖుషీ అవుతున్నారు. మొత్తానికి మహేష్ 25 వ సినిమా ఓ ల్యాండ్ మార్క్ గా నిలవడంతో మహర్షి చిత్ర బృందం సంతోషంగా ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడే స్పెషల్ షోలు పడుతున్నాయి. ఇక కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ లో మహేష్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాలలో మహర్షి ఫలితం తేలనుంది.