మహర్షి పాలపిట్ట పాట రివ్యూ


Maharshi Poster
Maharshi Poster

మహేష్ బాబు – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న మహర్షి చిత్రంలోంచి నిన్న సాయంత్రం పాలపిట్ట అనే లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసారు ఆ చిత్ర బృందం . పాలపిట్ట లిరికల్ వీడియో సాంగ్ మహేష్ ఫ్యాన్స్ ని విపరీతంగా అలరించేలా ఉంది . దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పాలపిట్ట పాటకు మరింత వన్నె తెచ్చింది . లిరిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి దానికి తోడు లిరికల్ వీడియో కోసం కట్ చేసిన మహేష్ – పూజా ల స్టిల్స్ కూడా మరింతగా ఆకర్షిస్తున్నాయి .

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 9న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . దానికంటే ముందుగా మే 1న హైదరాబాద్ లో మహర్షి ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్నారు . మహేష్ మూడు రకాల గెటప్ లలో కనిపించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి .