మహర్షి వేడుక మే 1న జరుగనుందా ?


మహేష్ బాబు తాజాగా నటిస్తున్న మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1న చేయనున్నట్లు తెలుస్తోంది . మే 9 న మహర్షి చిత్రం విడుదల అవుతుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మే 1 న చేయబోతున్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి పారిస్ వెళ్ళాడు . అక్కడి నుండి తిరిగి వచ్చాక మహర్షి ప్రమోషన్స్ లో పాల్గొననున్నాడు అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా .

మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటించింది , మహేష్ బాబు మూడు గెటప్ లలో కనిపిస్తుండటంతో మహర్షి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు . అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు . మహర్షి రాక కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు .