భయపడుతున్న అనిల్ రావిపూడి


పటాస్ , సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశం వచ్చింది దర్శకులు అనిల్ రావిపూడి కి . అయితే మహర్షి చిత్రానికి ముందు సూపర్ స్టార్ తో పనిచేయబోతున్నాను అంటూ సంతోషంగా ఉండేవాడు కానీ ఎప్పుడైతే మహర్షి చిత్రం ఆశించిన స్థాయిలో విజయం నమోదు చేయకపోవడంతో అనిల్ రావిపూడి కి భయం పట్టుకుంది .

మహర్షి చిత్రంపై ఎన్నో అంచనాలు ఉండేవి అయితే ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది మహర్షి చిత్రం . మహర్షి తర్వాత అనిల్ రావిపూడి తో మహేష్ బాబు చేస్తున్న చిత్రం కావడంతో తప్పకుండా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే . అందుకే అనిల్ రావిపూడి పై ఒత్తిడి ఎక్కువ అవుతోందట ! ఆ ఒత్తిడి వల్ల అనిల్ లో కాస్త భయం కూడా చోటు చేసుకుంది . ఒత్తిడి అధికం కావడంతో ఈ ప్రాజెక్ట్ ని సవాల్ గా తీసుకున్నాడట అనిల్ . యాక్షన్ కు వినోదాన్ని జతచేసి బ్లాక్ బస్టర్ కొట్టడం అనిల్ స్టైల్ . మరి ఈ సారి మహేష్ తో బ్లాక్ బస్టర్ కొడతాడా ? లేక ఒత్తిడికి లోనై తడబడతాడా ? చూడాలి .