మహర్షి కథ లీకయ్యింది


మహర్షి కథ లీకయ్యింది
మహర్షి పోస్టర్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి కథ ఇదే అంటూ ఫిల్మ్ నగర్ సర్కిల్లో తెగ వైరల్ అవుతోంది . వినబడుతున్న కథనం కు తగ్గట్లుగా ట్రైలర్ ఉండటం అలాగే డైలాగ్స్ కూడా ఉండటంతో లీకైన కథ నిజమే అనిపిస్తోంది . ఇంతకీ కథ ఏంటంటే …… రిషి ( మహేష్ బాబు ) కాలేజ్ ని కంప్లీట్ చేసాక అమెరికా వెళ్తాడు అక్కడ ఓ లీడింగ్ సాఫ్ట్ వేర్ కంపెనీ కి సి ఈ ఓ అవుతాడు . డబ్బు ….. డబ్బు …. డబ్బు అంటూ తన మేధా శక్తిని డబ్బు సంపాదించడం కోసమే వినియోగిస్తాడు .

అయితే డబ్బు మాత్రమే ప్రపంచం అని భావించే రిషి జీవితంలో అనూహ్య సంఘటనలు జరుగుతాయి , దాంతో సాటి మనిషి కోసం మానవతావాదిగా మారతాడట ! అలా రిషి ఎందుకు మారాల్సి వచ్చింది ? రిషి మారడానికి , తిరిగి ఇండియాకు రావడానికి కారకులు ఎవరు ? అన్నది తెలియాలంటే ఈనెల 9 వరకు ఎదురు చూడాల్సిందే . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముగ్గురు నిర్మాతలు నిర్మించారు . పూజా హెగ్డే , అల్లరి నరేష్ , జయసుధ , ప్రకాష్ రాజ్ , జగపతిబాబు తదితరులు నటించారు .