తప్పు మీద తప్పు చేస్తున్న మహర్షి టీమ్


మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం పై కాపీ ఆరోపణలు తీవ్రం అయ్యాయి , అందుకు మహర్షి టీమ్ చేస్తున్న తప్పులే కారణం . మహర్షి టీజర్ , వీడియో సాంగ్ , పోస్టర్స్ ఇలా అన్ని కూడా అచ్చం శ్రీమంతుడు చిత్రాన్ని పోలినట్లుగా ఉండటం . ప్రతీ స్టిల్ శ్రీమంతుడు ని గుర్తుకు తెస్తుండటంతో ఇది శ్రీమంతుడు చిత్రానికి కొనసాగింపు గా ఉంది , శ్రీమంతుడుకు కాపీ అంటూ రకరకాల మాటలు వినిపిస్తున్నాయి .

ఇలా టాక్ బాగా స్ప్రెడ్ అవ్వడానికి ముమ్మాటికీ మహర్షి టీమ్ వదులుతున్న ప్రమోషన్స్ కారణం అనే చెప్పాలి . ఇన్ని రకాల మాటలు వస్తున్నప్పటికీ వాళ్ళు మాత్రం ఎక్కడా జాగ్రత్తలు తీసుకోవడం లేదు . మహర్షి , శ్రీమంతుడు కథలు ఒకేలా పోలి ఉండటం కూడా ఈ గందరగోళానికి కారణం అనుకుంటా ! మే 1 న హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు అలాగే మే 9న మహర్షి చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు .