మహేష్ బాబు కొత్త సినిమా ఉగాది కి రిలీజ్ అట


mahesh 25 th film releasing on 2019 ugadi

మహేష్ బాబు తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . అగ్ర నిర్మాతలు అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు . ఇక ఈ చిత్ర విడుదలని ప్రకటించాడు మహేష్ బాబు . ఈ సినిమా విడుదలయ్యేది ఎప్పుడో తెలుసా ……. ….. 2019 లో ఉగాది సందర్బంగా విడుదల చేయడానికి డిసైడ్ అయ్యారు దర్శక నిర్మాతలు .

మహేష్ బాబు కు ఈ సినిమా 25 వది కావడం విశేషం , 25 వ సినిమా అంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ కు చుక్కలు చూపించింది అజ్ఞాతవాసి చిత్రం . అలాగే మరికొంతమంది హీరోలకు కూడా చేదు అనుభవమే ఎదురయ్యింది , ఇప్పుడేమో మరో ముగ్గురు హీరోలు 25 వ సినిమా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఒకటి మినహా మిగతావన్నీ హిట్స్ దాంతో ఈ సినిమాపై అనుమానాలు లేవు హిట్ కంపల్సరీ అని వినబడుతోంది అయితే ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందా చూడాలి .

2019లో ఉగాది కానుకగా తన 25 వ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు మహేష్ . భరత్ అనే నేను చిత్రం సంచలన విజయం తర్వాత వచ్చే చిత్రం కాబట్టి తప్పకుండా భారీ అంచనాలు ఉంటాయి . ఉగాది కి చాలా సినిమాలే పోటీ పడుతున్నాయి అయితే మహేష్ కున్న క్రేజ్ వేరు కాబట్టి 25 వ సినిమా పై ఆశగా ఉన్నారు ఆ చిత్ర నిర్మాతలు అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు .

English Title: mahesh 25 th film releasing on 2019 ugadi