సై అంటే సై అంటున్న మహేష్, బన్నీ


mahesh allu arjun clash for sankranthi
mahesh allu arjun clash for sankranthi

తెలుగు సినిమాలకి సంక్రాంతి పండగ అనేది చాలా ప్రాముఖ్యమైనది. సినిమా బాగుంది అన్న టాక్ వస్తే కలెక్షన్ల సునామి రావడం ఖాయం. అందుకే నిర్మాతలు ఎక్కువగా ఈ సీజన్ ను టార్గెట్ చేస్తుంటారు. ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రాలు సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేస్తున్నాయి.

అయితే ఎంత సంక్రాంతి సీజన్ అయినా నిర్మాతలకు ఒకేసారి రెండు సినిమాలు విడుదల కావడమనేది ఇబ్బందికర పరిణామమే. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ పై ఈ పోటీ తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అందుకే ఈ రెండు భారీ చిత్రాలు క్లాష్ అవ్వకుండా ఉండేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సంక్రాంతి మంగళవారం అవ్వడంతో జనవరి 10 విడుదల తేదీ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది.

ప్రస్తుతానికి ఈ రెండు చిత్రాలు కూడా ఆ డేట్ ను వదులుకోవడానికి ఆసక్తి చూపించట్లేదు. మరి ఈ రెండు చిత్రాలలో ఏదైనా త్యాగం చేస్తుందో లేదా రెండూ పోటీకి సై అంటాయో తెలియాలంటే మరికొద్ది కాలం వేచి చూడాలి.