మహేష్ – బన్నీ.. న్యూ రిలీజ్ డేట్స్?


mahesh allu arjun movies release dates
mahesh allu arjun movies release dates

టాలీవుడ్ లో చాలా రోజుల తరువాత రెండు పెద్ద సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ యుద్ధం ఇంట్రెస్టింగ్ గా మారింది. గతంతో పోలిస్తే నేటితరం హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి చాలా దూరంగా ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల నిర్మాతలు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు గాని ఈగోకి పోయి ఎవరుకూడా రిస్క్ చేయడం లేదు. ఇకపోతే ఎవరు ఊహించని విధంగా మహేష్బన్నీ సినిమాలు పొంగల్ బరిలో నిలవడం అభిమానులకు షాక్ ఇచ్చింది.

సరిలేరు నీకెవ్వరు  – అల..వైకుంఠపురములో.. సినిమాలు రెండు కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రిలీజ్ డేట్స్ లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు – అల్లు అరవింద్ ఈ డేట్స్ పై మొదటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. ఇక ఇప్పుడు మినిమమ్ ఒకరోజు గ్యాప్ ఉండేలా సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నారట.
చిత్ర యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు సినిమాను రిలీజ్ చేయడానికి ఫిక్స్ అవ్వగా.. అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో జనవరి 13కి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ డేట్స్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. వీలైనంత వరకు రెండు సినిమాలకుక్లాష్ లేకపోతేనే బెటర్ అని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. కానీ డేట్ ని మిస్ చేసుకుంటే కలెక్షన్స్ మిస్ అవుతామనే భయం కూడా ఉంది. సో.. ఈ రిలీజ్ డేట్స్ పై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.