రెడీ అయిన మహేష్ బాబు మల్టీ ప్లెక్స్ లు


MAHESH AMB Cinemas open with rajinkanth 2.0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ ల బిజినెస్ లోకి దిగిన విషయం తెలిసిందే . భారీ రెమ్యునరేషన్ మహేష్ అందుకుంటున్నాడు దాంతో అలా వచ్చిన పెద్ద మొత్తాన్ని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులుగా పెట్టారు నమ్రతా . ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ముంబై లో కూడా ఖరీదైన భూములతో పాటు విలాసవంతమైన భవంతులను కొనగా తాజాగా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగాడు మహేష్ . పేరుకి మహేష్ బాబు అయినప్పటికీ తెరవెనుక అంతా ప్లానింగ్ చేసేది మాత్రం మహేష్ భార్య నమ్రత మాత్రమే ! పెద్ద మొత్తంలో వస్తున్నా డబ్బులను ఇప్పుడే సద్వినియోగం చేయాలనీ భావించిన నమ్రత ఇలా రకరకాల రూపంలో పెట్టుబడులు పెడుతోంది .

తాజాగా హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఏషియన్ ఫిలిమ్స్ వాళ్లతో కలిసి జాయింట్ వెంచర్ గా ” ఏ ఎం బి ” అనే షాపింగ్ మాల్ కు తెరలేపాడు మహేష్ . ఏ ఎం బి అంటే ఏషియన్ ఫిలిమ్స్ మహేష్ బాబు అని . అంతర్జాతీయ స్థాయిలో ఉన్న థియేటర్ లు ఈ మల్టిప్లెక్స్ స్పెషాలిటీ . అయితే ఈ థియేటర్ లను ఈనెల మొదటివారంలో ప్రారంభించాలని అనుకున్నారు కానీ ఈ మల్టీప్లెక్స్ స్థాయికి రజనీ నటించిన 2. 0 చిత్రం అయితేనే కరెక్ట్ అని భావించారట . దాంతో ఈనెల 29 న కానీ లేదంటే ఈనెల 16 న కానీ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు మహేష్ అండ్ కో .

English Title: MAHESH AMB Cinemas open with rajinikanth 2.0