`ఆర్ ఆర్ ఆర్‌` లో మెగాస్టార్‌, సూప‌ర్‌స్టార్‌?


`ఆర్ ఆర్ ఆర్‌` లో మెగాస్టార్‌, సూప‌ర్‌స్టార్‌?
`ఆర్ ఆర్ ఆర్‌` లో మెగాస్టార్‌, సూప‌ర్‌స్టార్‌?

`బాహుబ‌లి` వంటి సంచ‌ల‌న చిత్రంతో దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ని సొంతం చేసుకున్నారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఆ క్రేజ్‌ని అలాగే కొన‌సాగించాల‌ని, ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త స‌ర్‌ప్రైజ్‌ని అందించాల‌ని ఆయ‌న చేస్తున్న తాజా ప్ర‌య‌త్నం `ఆర్ ఆర్ ఆర్‌`. టాలీవుడ్ సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత భారీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంగా ఈ సినిమాని మ‌లుస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి న‌టిస్తున్న ఈ సినిమా ఓ సెల్యూలాయిడ్ వండ‌ర్‌గా నిల‌వాల‌ని రాజ‌మౌళి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగా ఈ సినిమా కోసం బాలీవుడ్‌, హాలీవుడ్ న‌టుల్ని ఎంపిక చేసుకున్నారు. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రంభీంగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. మిగ‌తా పాత్ర‌ల్లో బాలీవుడ్ న‌టులు అజ‌య్‌దేవ‌గ‌న్‌, అలియాభ‌ట్ న‌టిస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన రే స్టీవెన్‌స‌న్‌, అలీస‌న్ డూడీ. ఓలివియా మోరీస్ కీల‌క పాత్ర‌ల్ని పోషిస్తున్నారు.

ఇదిలా వుండ‌గా ఈ చిత్రానికి మ‌రిన్ని అద‌న‌పు హంగుల్ని జోడించ‌బోతున్నారు. ఇద్ద‌రు ఫ్రీడ‌మ్ ఫైట‌ర్‌ల క‌థ‌గా రాబోతున్న ఈ సినిమాకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, సూప‌ర్‌స్టార్ మహేష్‌ల చేత వాయిస్ ఓవ‌ర్ ఇప్పించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. తెలుగు వెర్ష‌న్‌కు మ‌హేష్ చేత‌, హిందీ వెర్ష‌న్‌కు బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ చేత వాయిస్ ఓవ‌ర్ చెప్పించాల‌ని రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది. ఈ రెండు భాష‌ల త‌ర‌హాలోనే త‌మిళ‌, మ‌ల‌యాళ, క‌న్న‌డ భాష‌ల్లోనూ అక్క‌డి సూప‌ర్‌స్టార్స్‌తో వాయిస్ ఓవ‌ర్ ఇప్పించాల‌ని రాజ‌మౌళి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని తెలిసింది.