రాజ‌మౌళి కోసం మ‌హేష్ రెండేళ్లు ఆగాల్సిందేనా?

రాజ‌మౌళి కోసం మ‌హేష్ రెండేళ్లు ఆగాల్సిందేనా?
రాజ‌మౌళి కోసం మ‌హేష్ రెండేళ్లు ఆగాల్సిందేనా?

2019 `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్‌తో మొద‌లుపెట్టారు హీరో మ‌హేష్. ఈ మూవీ హిట్ జోష్‌తో వున్న ఆయ‌న అదే ఊపులో మ‌రో చిత్రాన్ని ప్రారంభించాల‌నుకున్నారు. మెరుపు వేగంతో అందుకు సంబంధించిన చ‌ర్చ‌లు కూడా పూర్తి చేశారు. కానీ క‌రోనా దెబ్బ‌తో ఆ ప్లాన్ మొత్తం తారుమారైపోయింది. ‌దీంతో ప‌ర‌శురామ్‌తో చేయ‌బోతున్న `స‌ర్కారు వారి పాట‌` ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. వ‌చ్చే నెల నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ప్రారంభించ‌బోతున్నారు.

ఆగ‌స్టులో ఈ మూవీని ఎట్టిప‌రిస్థితుల్లోనూ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత మ‌హేష్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. `ఆర్ ఆర్ ఆర్‌` చిత్రీక‌ర‌ణతో రాజ‌మౌళి బిజీగా వున్నారు. ఈ మూవీ ఎప్పుడు విడుద‌ల‌వుతుందన్న‌ది మాత్రం క్లారిటీ లేదు.

ఈ మూవీ రిలీజ్ త‌రువాత ఏడాది పాటు రాజ‌మౌళి విశ్రాంతి తీసుకుంటాన‌ని ఇంత‌కు ముందే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అంటే 2022లో రాజ‌మౌళి ఎలాంటి సినిమా చేయ‌రు. పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు. అంటే మ‌హేష్ సినిమా 2023లో మొద‌ల‌వుతుంద‌న్న‌మాట‌. అంటే రాజ‌మౌళితో సినిమా అంటే మ‌హేష్ మ‌రో రెండేళ్ల వ‌ర‌కు వేచి చూడాల్సిందే.