మ‌హేష్‌తో సితార గేమ్ వీడియో వైర‌ల్!


మ‌హేష్‌తో సితార గేమ్ వీడియో వైర‌ల్!
మ‌హేష్‌తో సితార గేమ్ వీడియో వైర‌ల్!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా షూటింగ్‌లు ఆగిపోవ‌డంతో గ‌త రెండున్న‌ర‌ నెల‌లుగా హీరో సూప‌ర్‌స్టార్ మహేష్ ఇంటి ప‌ట్టునే వుంటున్నారు. నిత్యం త‌న పిల్ల‌లు గౌత‌మ్‌, సితార‌తో స‌మ‌యాన్ని గ‌డిపేస్తున్నారు. వీడియో గేమ్స్‌, స్విమ్మింగ్‌, ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ పిల్ల‌ల్లో నూత‌నోత్తేజాన్ని క‌లిగిస్తున్నారు. సితార‌తో క‌లిసి ఎక్కువ స‌మ‌యాన్ని గ‌డుపుతున్న మ‌హేష్ ఆమెతో క‌లిసి స‌ర‌దా గేమ్స్ ఆడుతుండ‌టం ఆక‌ట్టుకుంటోంది.

తాజాగా మ‌హేష్ ఓ ఆస‌క్తిక‌ర‌మైన వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మ‌హేష్ త‌న ముద్దుల కూతురు సితార తో క‌లిసి టంగ్ ట్విస్ట‌ర్ గేమ్ ఆడ‌టం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఓ క్లిష్ట‌మైన ప‌దాన్ని సితార ప‌ల‌క‌డం, అలా కాద‌ని మ‌హేష్ అంటుంటే.. ఈ గేమ్‌లో తానే గెలిచాన‌ని మ‌హేష్‌తో సితార వాదిస్తున్న వీడియో ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది.

ఈ ఏడాది ప్రారంభంలో `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న‌ మ‌‌హేష్ ప్ర‌స్తుతం యంగ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించ‌నున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

Credit: Twitter ‌