స్టార్ డైరెక్ట‌ర్‌కు మ‌హేష్ మ‌ధ్య వైరం క్లియ‌ర్‌?స్టార్ డైరెక్ట‌ర్‌కు మ‌హేష్ మ‌ధ్య వైరం క్లియ‌ర్‌?
స్టార్ డైరెక్ట‌ర్‌కు మ‌హేష్ మ‌ధ్య వైరం క్లియ‌ర్‌?

ఈ ఏడాది ప్రారంభంలో `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో మ‌హేష్ భారీ శుభారంభాన్ని అందించారు. జ‌న‌వ‌రి సంక్రాంతి బ‌రిలో నిలిచిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి మ‌హేష్ ఖాతాలో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్‌ని అందించింది. ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ జోష్‌లో వున్న మ‌హేష్ తన త‌దుప‌రి చిత్రాన్ని యంగ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురాం పెట్లు ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న విష‌యం తెలిసిందే.

`స‌ర్కారు వారి పాట‌` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ , 14 రీల్స్ ప్ల‌స్ తో క‌లిసి జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత మ‌హేష్ వ‌రుస‌గా సినిమాలు చేయ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టికే రాజ‌మౌళిని లైన్‌లో పెట్టేశాడు. ఆ త‌రువాత వ‌రుస‌లో త్రివిక్ర‌మ్, అనిల్ రావిపూడి కూడా చేరార‌ట‌.

ఇందులో షాకింగ్ విష‌యం ఏంటంటే ఈ జాబితాలో లెక్క‌ల మాస్టారు సుకుమార్ కూడా వున్న‌ట్టు తెలుస్తోంది. `పుష్ప‌`కు ముందు మ‌హేష్‌తో సుకుమార్ సినిమా చేయాల్సింది. కానీ క‌థ న‌చ్చ‌లేదని, ఇద్ద‌రి మ‌ధ్య క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌చ్చాయ‌ని ఆ కార‌ణంగానే తామిద్ద‌రం క‌లిసి సినిమా చేయ‌డం లేద‌ని మ‌హేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. దీన్ని అవ‌మానంగా భావించిన సుకుమార్ వెంట‌నే బ‌న్నీతో సినిమా ఓకే చేయించుకున్నారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య వాతావ‌ర‌ణం హీటెక్కింది. తాజాగా ఇద్ద‌రు త‌మ వైరానికి ప్యాచ‌ప్ చెప్పుకున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రూ క‌లిసి కొత్త త‌ర‌హా సినిమాని చేయ‌బోతున్నార‌ని ఇండ‌స్ట్రీ టాక్‌.