‌మ‌హేష్‌తో మ‌రోసారి మిల్కీ బ్యూటీ!

Mahesh and tamanna team up once again
Mahesh and tamanna team up once again

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు తో క‌లిసి మ‌రోసారి త‌మ‌న్నా న‌టిస్తోంది. గ‌తంలో వీరిద్ద‌రూ క‌లిసి `ఆగ‌డు` చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే. మ‌హేష్‌కు జోడీగా త‌మన్నా న‌టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత కొన్నేళ్ల‌కి వీరిద్ద‌రు క‌లిసి న‌టించిన చిత్రం `స‌రి లేరు నీకెవ్వ‌రు`. అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించి మెస్మ‌రైజ్ చేసింది.

గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ‌అయితే తాజాగా మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి న‌టించ‌బోతున్నారు. అయితే ఈ సారి సినిమా కోసం కాకుండా క‌మ‌ర్షియ‌ల్ యాడ్ కోసం కావ‌డం గ‌మ‌నార్హం. `అర్జున్‌రెడ్డి` ఫేమ్ సందీప్‌రెడ్డి వంగ స్టార్ హీరో మ‌హేష్‌తో క‌మ‌ర్ష‌య‌ల్ యాడ్‌ని రూపొందించ‌బోతున్న విష‌యం తెలిసిందే.

ఈ యాడ్‌లో మ‌హేష్‌తో క‌లిసి త‌మ‌న్నా కూడా న‌టించ‌బోతోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ ప్రారంభ‌మైంది. హ‌వెల్స్ బ్రాండ్ కోసం ఈ యాడ్ క‌మర్షియ‌ల్‌ని షూట్ చేస్తున్నారు. ఈ యాడ్ కోసం మ‌హేష్‌, త‌మ‌న్నాల‌కు భారీ పారితోష‌కం అందిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.